• Neti Charithra

Breaking..చిత్తూరు జిల్లాలో జాతీయ రహదారిపై.. పెద్దయెత్తున్న రాస్తా రోకో..!


Breaking..చిత్తూరు జిల్లాలో

జాతీయ రహదారిపై.. పెద్దయెత్తున్న రాస్తా రోకో..!పలమనేరు: నేటి చరిత్ర


అటవీ శాఖ అధికారుల తీరు ను నిరసిస్తూ.. పెద్ద ఎత్తున రైతులు రాస్తా రోకో చేసిన ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి న వివరాలు ఇలా ఉన్నాయి.పలమనేరు, గంగవరం మండలాల్లో ఏనుగుల దాడుల నుండి రక్షణ కల్పించాలంటూ.. సోమవారం చిత్తూరు - పలమనేరు జాతీయ రహదారిపై దాదాపు వెయ్యిమంది రైతులు భారీ రాస్తారోకో చేపట్టారు. అటవీ అధికారులు డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. రైతులు మాట్లాడుతూ.. గత నాలుగైదు రోజులుగా ఏనుగులు పంటలపై దాడిచేసి ధ్వంసం చేస్తున్నాయని, ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నామని భయాందోళన వ్యక్తం చేశారు. రెండు రోజుల క్రితం జిల్లా కలెక్టర్‌ ను కలిశామని, సోమవారం పలమనేరు అటవీ కార్యాలయం వద్దకు రావాలని చెప్పారని, అయితే రైతులు కార్యాలయం వద్దకు రాగా అటవీ అధికారులు బయటకు వెళ్లారంటూ.. నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని రైతులు అగ్రహిస్తూ.. నిరసన కార్యక్రమాలు చేపట్టారు.