• Neti Charithra

Breaking.. చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం..బస్సు బోల్తా..ముగ్గురు మృతి..12మందికు గాయాలు!


Breaking.. చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం..బస్సు బోల్తా..ముగ్గురు మృతి..12మందికు గాయాలు!


మదనపల్లె: నేటి చరిత్ర


(బస్సు ప్రమాద దృశ్యాలు)

చిత్తూరు జిల్లా మదనపల్లె సమీపం లో ప్రయివేటు బస్సు బోల్తాపడటంతో ముగ్గురు మృతి చెందారు. ప్రమాద స్థలాన్ని సబ్ కలెక్టర్ జాహ్నవి, సీఐ శ్రీనివాసులు పరిశీలించారు.

ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మదనపల్లె- బండకిందపల్లె మార్గంలో తిరుగుతున్న ప్రయివేటు బస్సు మంగళవారం మధ్యాహ్నం జ్యుస్ ఫ్యాక్టరీ సమీపంలో అదుపు తప్పి బోల్తా పడింది.

ఈ ప్రమాదం లో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో 12 మంది కి తీవ్రగాయాలు అయ్యాయి. ఈ ప్రమాదం తో ఆ ప్రాంతం అరుపులు కేకలతో దద్దరిల్లింది. సమాచారం అందుకున్న పోలీసులు క్షత గాత్రులను స్థానిక జిల్లా ఆసుపత్రికి తరలించారు.