• Neti Charithra

Breaking.. చిత్తూరు జిల్లా లో కర్ణాటక యువకుడి.. హత్య!


Breaking.. చిత్తూరు జిల్లా లో కర్ణాటక యువకుడి.. హత్య!





శాంతిపురం: నేటి చరిత్ర



చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం లో కర్ణాటక కు చెందిన ఓ వ్యక్తి హత్యకు గురైనట్లు తెలుస్తోంది. మండల పరిధి లోని ఏకే పురం చెరువు లో ఓ మృత దేహాన్ని ఓ గొర్రెల కాపరి గుర్తించి పోలీసులకు

సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న రాళ్ళ బుదుగురు పోలీసులు మృతుడు కర్ణాటక రాష్ట్రం కోలారు జిల్లా బంగారు పేట తాలుకా మిట్ట కొత్తూరు కు చెందిన శంకరప్ప గా పోలీసులు

గుర్తించారు. మృతుని నీళ్ల లో నుంచి బయటకు తీశారు. అతన్ని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసి మృతుని నడుముకు రాయిని కట్టి చెరువులో వేసి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.