• Neti Charithra

Breaking.. చిత్తూరు జిల్లా లోకట్టుకున్న భర్తే.. పట్టపగలు భార్య గొంతు కోసి హత్య చేశాడు..!


Breaking.. చిత్తూరు జిల్లా లోకట్టుకున్న భర్తే.. పట్టపగలు భార్య గొంతు కోసి హత్య చేశాడు..!



చిత్తూరు:నేటి చరిత్ర


కట్టుకున్నభర్తే.. కాల యముడు అయ్యాడు.

అందరి చూస్తుండగానే ఆమె పై దాడి చేసి కత్తి తో దారుణ హత్య చేసిన ఘటన చిత్తూరు జిల్లాలో మంగళవారం చోటు చేసుకుంది.

పోలీసుల కథనం మేరకు.. కేవీబీ పురంలో సూర్య బాబు, సుహాసినిలు నివాసముంటు న్నారు. వీరికి 12 ఏళ్లలోపు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. గత పదేళ్లుగా వీరి మధ్య అనుమానం పెనుభూతమై తరచూ గొడవలు పడేవారు. దీంతో గత ఐదేళ్లుగా ఇరువురూ వేర్వేరుగా ఉంటున్నారు.

మంగళవారం మధ్యాహ్నం సుహాసిని నివాసముంటున్న పరిసర ప్రాంతంలో ఎవరూ లేరని గుర్తించిన భర్త.. ఆమెపై దాడి చేశాడు. వెంట తెచ్చుకున్న కత్తితో ఒక్కసారిగా ఇంటి ఎదుటే గొంతు కోసి అక్కడి

నుంచి స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు నిందితుడికి కఠిన శిక్ష విధించాలని సుహాసిని బంధువులు పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఆందోళనకు దిగటం తో ఉద్రిక్తత నెలకొంది.


742 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon