• Neti Charithra

Breaking.. చిత్తూరు.. జిల్లా ఎస్పీ నే..బ్లాక్ మెయిల్ చేస్తూ..అడ్డదారి తొక్కిన ఏఎస్ఐ పై వేటు..!


Breaking.. చిత్తూరు..

జిల్లా ఎస్పీ నే..బ్లాక్ మెయిల్ చేస్తూ..అడ్డదారి తొక్కిన ఏఎస్ఐ పై వేటు..!



చిత్తూరు: నేటి చరిత్ర

విధి నిర్వహణలో నిర్లక్ష్యం తో పాటు

అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటు న్న ఓ పోలీస్ అధికారి సాక్షాత్తూ.. జిల్లా ఎస్పీ నే బ్లాక్ మెయిల్ చేయిస్తూ.. పట్టుపడడం తో అతని పై ఉన్నతాధికారులు వేటు వేశారు.

వివరాలు ఇలా ఉన్నాయి.

చిత్తూరు క్రైమ్ పోలీస్స్టేషన్లో ఏఎస్ఐగా పనిచేస్తున్న కె బి రాజేంద్రన్ ను సస్పెండ్ చేశారు.ఈ మేరకు ఆయనను సస్పెండ్ చేస్తూ గురువారం రాత్రి అనంతపురం రేంజ్ డీఐజీ కాంతిరాణా

టాటా ఉత్తర్వు జారీ చేశారు . చిత్తూరు క్రైమ్ పోలీస్స్టేషన్లో ఏఎస్ఐగా పనిచేస్తున్న రాజేంద్రన్ పై గత కొంత కాలంగా అనేక ఆరోపణలు వచ్చాయి. విచారణ పేరుతో స్టేషన్కు తీసుకు వచ్చే అనుమానితుల వద్ద నుంచి నగదు డిమాండ్ చేయడం , నగదు ఇవ్వకపోతే బెదిరించడం ఫిర్యాదుదారుల పట్ల దురుసుగా ప్రవర్తించడం వంటి ఆరోపణలు ఉన్నాయి . అలాగే దొంగతనం కేసులో అరెస్ట్ కాబడ్డ ఓ నిందితుడికి సంబంధించిన సెల్ఫోన్ ద్వారా ఏకంగా

జిల్లా ఎస్పీ తో పాటు మరో కీలక డిఎస్పీ ని బ్లాక్ మెయిల్ చేసి మీరు చేతి వాటాలు కు పాల్పడుతున్నారంటూ..

పోలీస్ ఉన్నతాధికారులను సైతం బ్లాక్మెయిల్ చేయడం వంటి ఫిర్యాదులు

గుర్తించిన జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ టూటౌన్ సీఐ యుగంధర్ ను క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ రాజేంద్రన్ ఆరోపణలపై విచారణ అధికారిగా నియమించారు. సీబీఐ విచారణలో రాజేంద్ర పలు అవినీతికి పాల్పడినట్లు తేలింది . దీంతో ఎస్పీ రాజేంద్ర కు సంబంధించిన విచారణ నివేదికను డీఐజీకి అందజేశారు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి చిత్తూరు క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ రాజేంద్రన్ ను సస్పెండ్ చేస్తూ డీఐజీ కాంతిరాణా టాటా ఉత్తర్వులు జారీ చేశారు.

Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్