• Neti Charithra

Breaking.. చిత్తూరు జిల్లా తో పాటు 13 జిల్లాల్లో పెరిగిన కరోనా కేసులు..!


Breaking.. చిత్తూరు జిల్లా తో పాటు 13 జిల్లాల్లో పెరిగిన కరోనా కేసులు..!



అమరావతి : నేటి చరిత్ర


ఎపి లో రెండవ విడత లో కరోనా కేసులు మళ్ళీ భారీగా పెరుగుతున్నాయి.

తాజాగా కరోనా కేసులు 947 నమోదయ్యాయి. శుక్రవారం కూడా 900కు పైగానే కేసులు వచ్చాయి. 24 గంటల్లో 42,696మందికి పరీక్షలు నిర్వహించగా.. 947 నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలుపుకుని రాష్ట్రంలో కేసుల సంఖ్య



( ఏపీ లోని 13 జిల్లాల్లో పెరిగిన కరోనా కేసులు)

8,97,810కి చేరింది. ఈ 24గంటల్లో ప్రాణ నష్టం జరగలేదు. మరోవైపు ఈ 24 గంటల్లో 377 మంది బాధితులు కోలుకున్నారు. చిత్తూరులో అత్యధికంగా 180, విశాఖపట్నంలో 156, గుంటూరులో 145, కృష్ణాలో 113 కేసులు నమోదయ్యాయి. పశ్చిమగోదావరిలో అత్యల్పంగా 18 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.


Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్