• Neti Charithra

Breaking... చిత్తూరు జిల్లా కు చేరుకున్న కోవిడ్ వ్యాక్సిన్.. టీకా ల పంపిణీ కి తేదీ ఖరారు..!


Breaking... చిత్తూరు జిల్లా కు చేరుకున్న కోవిడ్ వ్యాక్సిన్.. టీకా ల పంపిణీ కి తేదీ ఖరారు..!




తిరుపతి: నేటి చరిత్ర


కరోనా మహమ్మారి నుండి ప్రజలను కాపాడేం దుకు కేంద్ర ,రాష్ట్ర ప్రభు త్వాలు సంయుక్తంగా పం పిణీ చేయనున్న కోవిడ్ వ్యాక్సిన్ బుధవారం చిత్తూరు జిల్లా కు చేరింది .

విజయవాడ సమీ పంలోని గన్నవరం నుంచి నేరుగా జిల్లాకు మొత్తం 41,500 డోసు లు

చేరుకు న్నాయి. వీటిని డిస్టిక్ ఇమ్యునైజేషన్ ఆఫీసర్ డాక్టర్ హనుమంత రావు, స్టాటిస్టికల్ ఆఫీసర్ ముని రాజ, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ జ్ఞానశేఖర్ జిల్లా కు చేరుకున్న కోవిడ్ వ్యా క్సిన్ ను స్వీకరించి, డిఎం & హెచ్ ఓ కార్యాలయం

లో గల డిస్టిక్ వ్యాక్సినేష న్ స్టోర్ (కోల్డ్ స్టోరేజీ) లో తగిన ఉష్ణోగ్రత మధ్య భద్రపరిచారు.

జిల్లాకు వచ్చిన కోవిడ్ వ్యాక్సిన్ ను జిల్లా సం యుక్త కలెక్టర్ (అభివృ ద్ధి) వి.వీర బ్రహ్మం పర్య వేక్షణ లో ఏర్పాటు చేశారు... మరోవైపు ఈ నెల 16 న జిల్లాలో మొదటి విడత కోవిడ్ వ్యాక్సిన్ వేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా సంయుక్త కలెక్టర్ తెలిపారు.ప్రతి నియోజక వర్గం నందు రెండు కోవిడ్ లైవ్ వ్యాక్సినేషన్ కేంద్రా లు అలాగే రుయా ఆసుప త్రి నందు ఒకటి చొప్పున మొత్తం 29 కేంద్రాల యం దు కోవిడ్ లైవ్ వ్యా క్సినే షన్ చేయడం జరుగు తుందని.. మొదటి విడత లో భాగంగా హెల్త్ కేర్ వర్కర్లకు కోవిడ్ వాక్సిన్ ఇచ్చేందుకు అన్ని ఏర్పా ట్లు చేయడం జరిగిందని, ఇప్పటికే 37,703 మంది తో మొదటి విడత జాబి తాను సిద్ధం చేయడం జరిగిందని తెలి పారు. ఇప్పటికే పలు ప్రాం తాల్లో డ్రై రన్ కూడా నిర్వ హించి, టీకా వేసేందుకు సిద్ధంగా ఉన్నామని జిల్లా సంయుక్త కలెక్టర్ (అభి వృద్ధి) తెలిపారు.


456 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon