• Neti Charithra

Breaking.. చిత్తూరు జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా కు జాతీయ స్థాయి పురస్కారం..!


Breaking.. చిత్తూరు జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా కు జాతీయ స్థాయి పురస్కారం..!




చిత్తూరు : నేటి చరిత్ర


చిత్తూరు జిల్లాలో కరోనా నియంత్రణకు మరియు నివారణ చర్యల పై జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్త తీసుకున్న చర్యలకు గాను జాతీయ స్థాయిలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐ.ఎం.ఎ) న్యూ డిల్లీ వారు ఐ.ఎం.ఎ నేషనల్ ప్రెసిడెంట్ డా.రాజన్ శర్మా, జనరల్ సెక్రెటరీ డా.ఆర్.వి.అశోకన్ వర్చువల్ విధానంలో ఈ నెల 18 న జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తను ప్రశంసించారు. ఆన్ లైన్ లో అందుకు సంబందించిన ప్రశంసా పత్రం ను జిల్లా కలెక్టర్ కు పంపడం జరిగింది. జిల్లాలో కరోనా నియంత్రణకు చేసిన సేవలకు గాను నేడు కలెక్టరేట్ లో జరిగిన పి.సి అండ్ పి.ఎన్ డి టి యాక్ట్ అమలుకు సంబందించి జరిగిన వర్క్ షాప్ నందు గౌ.జిల్లా ప్రధాన న్యాయ మూర్తి ఎ.వి.రవీంద్రబాబు జిల్లా కలెక్టర్ ను ఘనంగా సన్మానించి ప్రశంసించారు. జిల్లా ఎస్.పి సెందిల్ కుమార్ జిల్లా కలెక్టర్ ను అభినందించారు.

*జిల్లా కలెక్టర్ కు అభినందనల వెల్లువ ..*


చిత్తూరు జిల్లాలో కరోనా నియంత్రణకు మరియు నివారణ చర్యల పై జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్త తీసుకున్న చర్యలకు గాను జాతీయ స్థాయిలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐ.ఎం.ఎ) న్యూ డిల్లీ వారు వర్చువల్ విధానంలో ప్రశంసించిన నేపధ్యంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్త ను జిల్లా ఉన్నతాదికారులైన తిరుపతి నగర పాలక కమిషనర్ గిరిష పి.ఎస్, జిల్లా జాయింట్ కలెక్టర్లు డి.మార్కండేయులు, వి.వీర బ్రహ్మo, మదనపల్లి సబ్ కలెక్టర్ జాహ్నవి, జిల్లా జాయింట్ కలెక్టర్ (సంక్షేమం) రాజశేఖర్, తిరుపతి, చిత్తూరు ఆర్.డి.ఓ లు కనకనరసా రెడ్డి, రేణుక, డి.ఎం అండ్ హెచ్ ఓ, డి.సి.హెచ్.ఎస్ డా.పెంచలయ్య, డా.సరళమ్మ, ఇతర జిల్లా స్థాయి ఉన్నతాధికారులందరూ కలెక్టర్ కి అభినందనలు తెలిపారు.