• Neti Charithra

Breaking..చిత్తూరు..గుంటూరు కలెక్టర్ల బదిలీ.. పలువురు పోలీస్ అధికారులపై బదిలీ వేటు..!


Breaking..చిత్తూరు..గుంటూరు కలెక్టర్ల బదిలీ.. పలువురు పోలీస్ అధికారులపై బదిలీ వేటు..!


నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతిని థి)


ఏపీ లో ఎన్నికల కమీషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ శనివారం ఎన్నికల షెడ్యూల్ జారీచేసే అవకాశం ఉండగా ఈ క్రమంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రత్యక్ష చర్యలకు సిద్ధమైంది. 9 మంది అధికారులను ఎన్నికల విధుల నుంచి ఎస్ఈసీ తొలగించింది. గుంటూరు, చిత్తూరు కలెక్టర్లను బదిలీ చేస్తూ ఎస్ఈసీ ప్రొసీడింగ్స్ జారీ చేసింది. తిరుపతి అర్బన్ ఎస్పీ, పలమనేరు, శ్రీకాలహస్తి డీఎస్పీలను కూడా ఎస్ఈసీ తొలగించింది. అంతేకాకుండా మాచర్ల, పుంగనూరు, రాయదుర్గం, తాడిపత్రి సీఐలను తొలగిస్తున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. తాజా నిర్ణయాలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.