• Neti Charithra

Breaking.. చిత్తూరు అమ్మఒడి ఆశ్రమం పై అధికారుల దాడులు.. బట్టబయలై న అక్రమాలు..!


Breaking.. చిత్తూరు అమ్మఒడి ఆశ్రమం పై అధికారుల దాడులు.. బట్టబయలై న అక్రమాలు..!



చిత్తూరు: నేటి చరిత్ర


ప్రభుత్వ అనుమతి లేకుండా చిత్తూరు లో అమ్మఓడి ఆశ్రమం నడుపున్న కేంద్రం పై ప్రభుత్వం కొరడా ఝుళిపించింది.

అమ్మఒడి అవినీతిపైజిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా ప్రత్యేక కమిటీ తో విచారణకు ఆదేశించారు.అమ్మ ఒడి నిర్వాహకుడు పద్మనాభ నాయుడిపై కలెక్టర్ సీరియస్ అయ్యారు.విచారణ

అధికారులుగాRDO, DSP, ICDS P.D లను నియమించారు.వీళ్ళు శనివారం ఆశ్రమాన్ని తనిఖీ చేశారు.ఆశ్రమంలో పిల్లలను ఉంచడానికి నిర్వాహకుడి కి ఎలాంటి అనుమతి లేదని అధికారులు గుర్తించారు చిన్నపిల్లలను విచారించగా తాము ఎక్కడి నుంచి వచ్చింది ఎప్పుడు వచ్చింది ఏది తెలియదని పేర్కొన్నారు దీనిపై ఐసిడిఎస్ పి. డీ.ఉష పనికర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణకు అడ్డుతగిలిన పద్మనాభ నాయుడిని ఆశ్రమం నుంచి బయటకు పంపించి పిల్లల్ని విచారించారు.

- అనాధ పిల్లల్ని చూపించి దాతల నుంచి పెద్ద మొత్తంలో విరాళాలు సేకరించి సొంతంగా వాడుకున్నట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.శిధిలావస్థలో ఉన్న భవనంలో పిల్లల్ని వృద్ధుల ఎలా ఉంచుతారని ప్రశ్నించిన అధికారులు

భవనంలో ఏదైనా ప్రమాదం ప్రమాదం జరిగి ప్రాణ నష్టం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ఫైర్ అయిన అధికారులు.

వెంటనే ఆశ్రమంలోని వృద్ధులను పిల్లలను ప్రభుత్వ హోమ్ కు తరలించేందుకు నిర్ణయం తీసుకున్నారు. నిర్వాహకుడి పై క్రిమినల్ కేసు నమోదు చేసి మరింత లోతుగా దర్యాప్తు చేయనున్నట్లు సమాచారం.


407 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon