• Neti Charithra

Breaking... చిత్తూరు.. అనంతపురం తో పాటు 5 జిల్లాల్లో 13 కళాశాలలను రద్దు చేసిన వైసీపీ సర్కార్..!



Breaking... చిత్తూరు.. అనంతపురం తో పాటు 5 జిల్లాల్లో 13 కళాశాలలను రద్దు చేసిన వైసీపీ సర్కార్..!




అమరావతి: నేటి చరిత్ర


ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

రాయలసీమ జిల్లాల్లో తో పాటు నెల్లూరు జిల్లాలోని పలు ఇంజనీరింగ్ కళాశాలలపై ప్రభుత్వం వేటు వేసింది. ముఖ్యంగా..

అనంత జేఎన్‌టీయూ పరిధిలోని ఇంజినీరింగ్‌ కళాశాలలపై వర్సిటీ యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం వర్సిటీ పాలకమండలి సమావేశం నిర్వహించారు. అనంతపురం జేఎన్‌టీయూ పరిధిలోని కర్నూలు, కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు సంబంధించి ఆయా కళాశాలల్లో సౌకర్యాలు, బకాయిలు, 25శాతం కంటే తక్కువ ప్రవేశాలు, రూ.30వేలు కంటే తక్కువ ట్యూషన్‌ ఫీజులు ఉన్న కళాశాలలను పరిగణనలోకి తీసుకున్న అనంతరం నిర్ణయం

తీసుకున్నారు. 25శాతం కంటే తక్కువగా ప్రవేశాలు ఉన్న కళాశాలలు 18 ఉన్నట్లు గుర్తించినా.. 13మాత్రమే మూసివేయాలని నిర్ణయించారు. అనంతపురంలో 2, చిత్తూరు 3, కర్నూలు 1, కడప 2, నెల్లూరు 5 కళాశాలలు మూసివేస్తారు. రూ.30వేల లోపు ట్యూషన్‌ ఫీజులు ఉన్న కళాశాలలకు సంబంధించి పది కళాశాలలు మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఉన్నత విద్యామండలి, అఖిల భారత సాంకేతిక విద్యామండలి నిర్ణయించిన ప్రమాణాలు లేని కళాశాలలకు సీట్లలో భారీగా కోత విధించారు. 2020-21 విద్యాసంవత్సరంలో త్వరలో నిర్వహించే ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ ప్రవేశాలకు ఐదు జిల్లాల్లో ఐదువేల సీట్లు కోత విధించారు.


Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్