• Neti Charithra

Breaking.. చెంచల్ గూడ జైల్లో ఆత్మహత్య చేసుకున్న కీసర తహసిల్దార్ నాగరాజు..!


Breaking.. చెంచల్ గూడ జైల్లో ఆత్మహత్య చేసుకున్న కీసర తహసిల్దార్ నాగరాజు..!



నేటి చరిత్ర:( ప్రత్యేక ప్రతిని థి)



కీసర మాజీ తహశీల్దార్ నాగరాజు చంచల్ గూడ జైల్లో ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనం కలిగించింది. గతంలో కోటి పదిలక్షల రూపాయల లంచం డిమాండ్ చేసిఏసీబీఅధికారులకు దొరికిపోయాడు.ఈ కేసులో నాగరాజును అరెస్ట్ చేసి చంచల్ గూడ జైలుకు పంపారు.   ఏసీబీ

అధికారులు ఆయనపై రెండో కేసును కూడా నమోదు చేశారు. దయారా గ్రామంలో 48 ఎకరాల విలువైన భూమికి నకిలీ పత్రాలు సృష్టించి మ్యుటేషన్ చేసినట్టు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.  ఈ కేసులో ఏసీబీ అధికారులు మాజీ ఎమ్మార్వో తో పాటుగా 9 మందిని నిందితులుగా చేర్చారు.  మాజీ తహశీల్దార్ ఇప్పటికే చంచల్ గూడ జైలులో



ఉన్నారు.  ఈ కేసుల్లో నిందితులు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు.  అయితే, మాజీ తహశీల్దార్ నాగరాజుకు బెయిల్ ఇచ్చేందుకు ఏసీబీ కోర్టు నిరాకరించింది.  కేసులో ప్రధాన నిందితుడిగా ఉండటంతో ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. 


Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్