- Neti Charithra
Breaking.. "చలో తంబల్లపల్లె" కు హాజరు అయితే అరెస్టు లు తప్పవు- మదనపల్లె డిఎస్పీ రవిమనోహర చారి..!
Breaking.. "చలో తంబల్లపల్లె" కు హాజరు అయితే అరెస్టు లు తప్పవు- మదనపల్లె డిఎస్పీ రవిమనోహర చారి..!
మదనపల్లె: నేటి చరిత్ర
చిత్తూరు జిల్లా టీడీపీ నేతలు శనివారం చేపట్టిన "చలో తంబల్లపల్లె " నిరసన కార్యక్రమానికి ఎలాంటి అనుమతులు లేవని మదనపల్లె డిఎస్పీ రవి మనోహర చారి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అంగళ్ళు వద్దటీడీపీ నేతల కాన్వాయ్ పై జరిగిన దాడులకు నిరసనగా టీడీపీ శనివారం " చలో తంబల్లపల్లె " కు పిలుపు ఇచ్చిన నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా టీడీపీ నేతలు ఈ కార్యక్రమానికి
హాజరు అయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. దింతో డిఎస్పీ రవిమనోహర చారి మాట్లాడుతూ 30 యాక్ట్ అమలులో ఉన్న కారణంగా ఎలాంటి నిరసన కార్యక్రమాలు కు అనుమతి లేదన్నారు. నిబంధనలు అతిక్రమించే వారిపై చట్టపర చర్యలు తప్పవని పేర్కొన్నారు.
1,947 views0 comments