• Neti Charithra

Breaking.. ఘోర రోడ్డు ప్రమాదం లో ముగ్గురు విద్యార్థులు మృతి..మదనపల్లె లో విషాదం..!


Breaking.. ఘోర రోడ్డు ప్రమాదం లో ముగ్గురు విద్యార్థులు మృతి..మదనపల్లె లో విషాదం..!


మదనపల్లె: నేటి చరిత్ర


(రోడ్డు ప్రమాదం లో మృతి చెందిన ముగ్గురు విద్యార్థులు)


చిత్తూరు జిల్లా మదనపల్లె సమీపం ఆరోగ్యవరం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహణం ను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో శుక్రవారం రాత్రి అక్కడికక్కడే ముగ్గురు యువకులు మృతి చెందారు. నిరుగట్టువారిపల్లె కు చెందిన

ముగ్గురు స్నేహితుల ద్విచక్ర వాహనం లో శనిటోరియం కు వెళ్లి వస్తుండగా ఎదురుగా వస్తున్న లారీ ఢీకొంది. ఈ ప్రమాదం లో నిరుగట్టువారిపల్లె కు చెందిన 10 వతరగతి చదువుతున్న ధనుష్, మనోజ్ తో పాటు

మరో విద్యార్థి ఘోర ప్రమాదంలో మృతి చెందటం తో విషాదం చోటుచేసుకుంది. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.