- Neti Charithra
Breaking.. ఘోర రోడ్డు ప్రమాదం లో ఆరుగురు మృతి.. తునా తునకలు ఆయిన వాహనాలు..!
Breaking.. ఘోర రోడ్డు ప్రమాదం లో ఆరుగురు మృతి.. తునా తునకలు
ఆయిన వాహనాలు..!
నేటి చరిత్ర:(ప్రత్యేక ప్రతిని థి)
తమిళనాడులో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ధర్మపురి - సేలం మార్గంలో అతి వేగంతో వచ్చిన లారీ బీభత్సం సృష్టించింది. సిమెంట్ లోడ్‌తో వెళుతున్న లారీ అదుపు తప్పి వాహనాలపై దూసుకు వెళ్లింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందారు. మరో 12 మంది
గాయపడ్డారు. ఈ ప్రమాదాల్లో భారీగా
వాహనాలు ధ్వంసం అయ్యాయి. దీంతో ఆ మార్గంలో పూర్తిగా ట్రాఫిక్ స్తంభించింది. ఘటనా స్థలంలో మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. గాయపడినవారిని సేలం సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద దృశ్యాలు భయానక స్థితిని తలపించాయి.
876 views0 comments