- Neti Charithra
Breaking.. ఘోర ప్రమాదం.. వివాహానికి వెళ్లివస్తూ.. లారీని ఢీకొన్న కారు.. ముగ్గురు మృతి..!
Breaking.. ఘోర ప్రమాదం..
వివాహానికి వెళ్లివస్తూ.. లారీని ఢీకొన్న కారు.. ముగ్గురు మృతి..!
విజయవాడ: నేటి చరిత్ర
రహదారి పై ఆగివున్న లారీ ని కారు ఢీ కొనడంతో ముగ్గురు మృతి చెందిన ఘటన కృష్ణాజిల్లా లో విషాదాన్ని నింపింది. స్థానిక పోలీసుల కథనం మేరకు..బాపులపాడు మండలం బోమ్ములూరు వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకోగ భీమవరంలో ఓ వివాహ కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తూ ఉండగా ప్రమాదం సంభవించింది. జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని వెనకవైపు నుంచి వచ్చి కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. గాయాలపాలైన మిగతా నలుగురిని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కారులో చిక్కుకుపోయిన మృతులను క్రేన్ సాయంతో బయటికి తీశారు. మృతుల్లో ఒకరు విజయవాడ వాసిగా, మరో ఇద్దరు చింతలపూడి మండలం ఎర్రగొండపల్లెకు చెందిన భార్య భర్తలు గా గుర్తించారు.