• Neti Charithra

Breaking.. ఘోరం..ఘోరం.. చెరువు లో దూకి.. చంటి బిడ్డలతో కలిసి తల్లి.. ఆత్మహత్య..!


Breaking.. ఘోరం..ఘోరం..

చెరువు లో దూకి..

చంటి బిడ్డలతో కలిసి

తల్లి.. ఆత్మహత్య..!



నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతిని థి)


నాగర్‌కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలం వట్టెం గ్రామంలో ఈ విషాదం చోటుచేసుకుంది. వట్టెం గ్రామానికి చెందిన అమృతమ్మ(21)కు అయిదేళ్ల క్రితం

తిమ్మాజిపేట మండలం పుల్లగిరికి చెందిన భానూరి రాజుతో వివాహమైంది. వీరికి మూడేళ్లు, ఆరు నెలల వయస్సు కుమార్తెలు ఉన్నారు. పెళ్లయిన కొద్ది రోజుల నుంచే భర్త ఆమెను అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడు. పలుమార్లు గ్రామపెద్దలు నచ్చజెప్పినా వేధింపులు ఆగలేదు. దీనికితోడు రెండో కాన్పు అనంతరం అమృతమ్మను తీసుకెళ్లడానికి

నిరాకరించాడు. బుధవారం గ్రామపెద్దలు మరోమారు సంప్రదింపులు జరిపినా ఫలితం లేకపోయింది. తీవ్ర మనోవేదనకు గురైన అమృతమ్మ ఇద్దరు కుమార్తెలతో సహా వట్టెం సమీపంలోని రఘుపతి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది

స్థానిక పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

.