- Neti Charithra
Breaking.. ఘోరం..ఘోరం..ఒకే కుటుంబం లో నలుగురు ఆత్మహత్య..!
Breaking.. ఘోరం..ఘోరం..ఒకే కుటుంబం లో నలుగురు ఆత్మహత్య..!
నేటి చరిత్ర:( ప్రత్యేక ప్రతిని థి)
రాజమండ్రిలో ఘోరం జరిగింది.
ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య
కు పాల్పడటం కల కలం రేపింది.
వివరాలు ఇలా ఉన్నాయి.
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి
అంబేడ్కర్ నగర్ కాలనీ, రామాలయం వీధిలో సోమవారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. విజయవాడకు చెందిన భర్త నాగేంద్ర కుమార్ రెండో పెళ్లి చేసుకున్నాడనే
మనస్తాపంతో భార్య తన కుమార్తెలు, కుమారుడితో కలిసి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. పిల్లలకు విషమిచ్చిన మహిళ, తర్వాత తన తల్లితో కలిసి ఉరివేసుకుని చనిపోయారు.
మృతులను సంగిశెట్టి కృష్ణవేణి (55),
భూపతి శివపావని (27) నిషాన్ (9),
రితికా (7)గా గుర్తించారు. ఈ ఘటనతో రాజమండ్రి ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అంబేడ్కర్ నగర్ రామాలయం వీధిలో విషాధ ఛాయలు అలుముకున్నాయి. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు.