• Neti Charithra

Breaking.. గోవా..టూ.. తంబల్లపల్లె అక్రమ మద్యం రవాణా.. పట్టుపడ్డ లక్షల ఖరీదైన మద్యం..!


Breaking.. గోవా..టూ.. తంబల్లపల్లె అక్రమ మద్యం రవాణా..పోలీసులకు

పట్టుపడ్డ లక్షల ఖరీదైన మద్యం..!
తంబల్లపల్లె: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా తంబల్లపల్లె లో పోలీసులు కు గోవా మద్యం భారీగా పట్టుపడింది. ఇందుకు సబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గోవా నుంచి రవాణా అవుతున్న


మద్యం విషయం సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా గోవా నుంచి ఇ చర్ లారీ లో భారీగా రవాణా అవుతున్న మద్యాన్ని పోలీసులు గుర్తించారు. 350 ఫుల్ బాటిళ్లు, 240 క్వాటర్ బాటిల్స్ పట్టుపడినట్లు సమాచారం.

ఈ సందర్భంగా ఇద్దరు నిందితులను పోలీసులు అదుపు లోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.


(పట్టు పడ్డ గోవా మద్యం)లారీ లో ఎవ్వరికీ అనుమానం రాకుండా

అరలు చేసి రహస్యంగా రవాణా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించగా

నిందితులను పోలీసులు విచారిస్తున్నారు.

పట్టు పడ్డ లారీ తో పాటు మద్యం విలువ

రూ.5 లక్షలుగా అధికారులు గుర్తించారు.

నిమ్మనపల్లె కు చెందిన ఓ కీలక వ్యక్తి గోవా మద్యాన్ని సరఫరా చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మరిన్ని సమాచారం తెలియాల్సి ఉంది.