• Neti Charithra

Breaking.. గ్రామ వాలంటీర్ పై.. దుండగుల దాడి.. పెన్షన్ డబ్బులు దోపిడీ..!


Breaking.. గ్రామ వాలంటీర్ పై.. దుండగుల దాడి.. పెన్షన్ డబ్బులు దోపిడీ..!అనంతపురం: నేటి చరిత్ర


పెన్షన్ డబ్బులు పంపిణీ చేసేందుకు

వెళుతున్న గ్రామ వాలంటీర్ పై గుర్తుతెలియని దుండగులు దాడి చేసి

నగదును దోచుకెళ్లిన ఘటన అనంతపురం జిల్లా లో చోటుచేసుకుంది.మడకశిర పట్టణం శివాపురంలో వాలంటీర్‌పై దాడి కలకలం రేపుతోంది. గురువారం ఉదయం పెన్షన్ ఇచ్చేందుకు వెళ్లిన వాలంటీర్ ఈరప్పపై కొందరు దుండగులు దాడి

చేశారు. ఈరప్ప కళ్లలో కారం చల్లి నగదును దోచుకెళ్లారు. తీవ్రంగా గాయపడిన ఈరప్పను వెంటనే  చికిత్స నిమిత్తం మడకశిర ఆస్పత్రికి తరలించారు.