- Neti Charithra
Breaking.. గోనె సంచుల్లో గంజాయి రవాణా.. పట్టుపడ్డ రూ.60 లక్షల సరుకు..!
Breaking.. గోనె సంచుల్లో గంజాయి రవాణా.. పట్టుపడ్డ రూ.60 లక్షల సరుకు..!
నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతిని థి)
గోనె సంచుల్లో రవాణా చేస్తున్న గంజాయి
విజయనగరం జిల్లాశృంగవరపుకోట
గోనెసంచుల మాటున గంజాయిని తరలిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి రూ.60 లక్షల విలువైన 1500 కిలోల సరకును స్వాధీనం చేసుకొని ముగ్గుర్ని అరెస్టు చేశారు.
వివరాలను ఎస్పీ బి.రాజకుమారి శనివారం ఎస్.కోట పోలీసుస్టేషనులో వెల్లడించారు. ఎస్ఐ రాజేష్ ఉపతహసీల్దార్, సిబ్బందితో కలిసి బౌడారా రోడ్డులోని ముషిడిపల్లి కూడలికి చేరుకోగా అక్కడ కొందరు వ్యాను నుంచి లారీలోకి గోనెసంచులను ఎక్కిస్తూ కనిపించారు. లారీ, వ్యాను తనిఖీ చేయగా అందులో 50 బస్తాల గంజాయి లభించింది.
విశాఖజిల్లా నాతవరం మండలం గోలుగొండపేటకు చెందిన గొంపా దుర్గాప్రసాద్, మల్లుభూపాలపట్నంకు చెందిన డి.రాజేష్‌వర్మ, ఉత్తరప్రదేశ్‌కు చెందిన విజయకుమార్‌లను అరెస్టు చేసి రిమాండుకు తరలించామన్నారు.