- Neti Charithra
Breaking.. గొంతుపై..పొడిచి..చేతి వేళ్లు కోసి..యువతి పై ప్రేమోన్మాది ఘాతుకం..!
Breaking.. గొంతుపై..పొడిచి..చేతి వేళ్లు
కోసి..యువతి పై ప్రేమోన్మాది ఘాతుకం..!
కడప:నేటి చరిత్ర
ప్రేమోన్మాది.. రెచ్చి పోయాడు.. తనకు యువతి లొంగలేదని.. ఏకంగా కత్తి తో
పైశాచికానికి పాల్పడిన ఘటన కడప జిల్లా లో కల కలం రేపింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రొద్దుటూరులో ప్రేమ పేరుతో ఉన్మాది రెచ్చిపోయాడు.
వివేకానంద కాలనీకి చెందిన సునీల్ అనే యువకుడు తనను ప్రేమించలేదన్న కారణంతో నేతాజీ నగర్‌కు చెందిన యువతి(17)పై దాడికి తెగబడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో కత్తితో ఆమెపై దాడి చేశాడు. దీంతో యువతి తల భాగం, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. చేతివేళ్లు కొన్ని తెగిపోయాయి. అప్రమత్తమైన స్థానికులు బాధితురాలిని హుటాహుటిన జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న సీఐ నాగరాజు, ఎస్సై శివశంకర్‌లు ఆస్పత్రికి చేరుకొని వివరాలు సేకరించారు. సునీల్ గత 3 నెలలుగా ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతున్నాడని యువతి కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు