• Neti Charithra

Breaking..గన్నవరం విమానాశ్రయం లో భారీ ప్రమాదం.. ప్రాణాలతో బయట పడ్డ 64 మంది ప్రయాణికులు..!


Breaking..గన్నవరం విమానాశ్రయం లో భారీ ప్రమాదం.. ప్రాణాలతో బయట పడ్డ

64 మంది ప్రయాణికులు..!


నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతినిథి)


కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయంలో ఎయిరిండియా అంతర్జాతీయ విమానానికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. దోహా నుంచి గన్నవరానికి వస్తున్న ఈ విమానం ల్యాండింగ్ సమయంలో అదుపుతప్పి విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో విమానం రెక్కలు దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదం సమయంలో విమానంలో

64మంది ప్రయాణికులు ఉన్నట్టు ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ తెలిపారు. అయితే, ప్రయాణికులంతా సురక్షితంగానే బయటపడటంతో ఎయిర్‌పోర్టు అథారిటీ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ల్యాండింగ్‌ సమయంలో ఒరిగిపోయిన విద్యుత్‌ స్తంభాన్ని తాకిందా? లేదంటే ఎలా జరిగిందనే దానిపై విచారిస్తున్నారు.

353 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon