• Neti Charithra

Breaking.. కేసు విచారణకు వెళ్లిన ఏఎస్ ఐ పై కత్తి పోట్లు.. పరిస్థితి విషమం..!


Breaking.. కేసు విచారణకు వెళ్లిన ఏఎస్ ఐ పై కత్తి పోట్లు.. పరిస్థితి విషమం..!




నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతినిథి)


స్టేషన్ కు వచ్చిన ఫిర్యాదు పై విచారణకు

వెళ్లిన ఓ ఏఎస్ఐ పై ఓ నిందితుడు కత్తి తో హత్యాయత్నానికి పాల్పడిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా లో కల కలం రేపింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వీరవాసరం శివారు బొబ్బనపల్లి సమీపంలో ఓ భూ వివాదంలో గొడవ జరుగుతున్న నేపథ్యంలో అక్కడ శాంతి భద్రతల పర్యవేక్షణకు ఏఎస్సై

పి.పార్థసారథి వెళ్లారు. భూ యజమానులు, ఏఎస్సై మధ్య వాగ్వాదం జరుగుతున్న సమయంలో అక్కడే ఉన్న ఓ యువకుడు ఏఎస్సై తలపై కత్తితో దాడి చేశాడు. దీంతో ఏఎస్సై తలకు తీవ్రగాయమైంది. అదే సమయంలో మరో వ్యక్తి ఎడమ చేతిపైనా ఆ యువకుడు కత్తితో దాడి చేశాడు. గాయపడిన వీరిద్దర్నీ స్థానికులు మొదట వీరవాసరం పీహెచ్‌సీకి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం దేమవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.  



Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్