• Neti Charithra

Breaking.. క్షుద్రపూజల.. జంట హత్య కేసు నిందితులను మళ్ళీ.. మదనపల్లె కు తరలింపు..!


Breaking.. క్షుద్రపూజల.. జంట హత్య కేసు నిందితులను మళ్ళీ.. మదనపల్లె కు తరలింపు..!


మదనపల్లె: నేటి చరిత్ర


తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన

చిత్తూరు జిల్లా మదనపల్లె జంట హత్యల కేసు నిందితులు ను పోలీసుల భద్రత మధ్య విశాఖ నుంచి ప్రత్యేక వాహనం లో మదనపల్లె కు తరలించారు. వివరాలు ఇలా ఉన్నాయి. మదనపల్లెలోని కుమార్తెల హత్య కేసు నిందితులు ఆసుపత్రి నుంచి డిశ్చార్జయ్యారు. విశాఖ మానసిక వైద్యశాల నుంచి పురుషోత్తం నాయుడు, పద్మజ డిశ్చార్జి కాగా.. ఇద్దరినీ మదనపల్లె సబ్‌జైలు సిబ్బందికి అధికారులు అప్పగించారు.

చిత్తూరు జిల్లా మదనపల్లెలో జనవరి 24న కన్నబిడ్డలను హతమార్చిన ఘటనలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ‘పురుషోత్తం, పద్మజ ఇద్దరికీ మానసిక వ్యాధి లక్షణాలు ను గుర్తించి చికిత్సకు విశాఖ మానసిక వై

ద్యశాలకు తరలించారు. చికిత్స అనంతరం

గురువారం విశాఖ వైద్యశాల నుంచి మదనపల్లె సబ్ జైలుకు వారిని తరలించగా శుక్రవారం వేకువ జామున వారు మదనపల్లె కు చేరుకున్నట్లు తెలుస్తోంది.