• Neti Charithra

Breaking.. క్షద్రపూజలు..పేరుతో జంట హత్యల కేసులో..హైడ్రామాల మధ్య తల్లి తండ్రులు అరెస్ట్..!


Breaking.. క్షద్రపూజలు..పేరుతో జంట హత్యల కేసులో..హైడ్రామాల మధ్య

తల్లి తండ్రులు అరెస్ట్..!



మదనపల్లె: నేటి చరిత్ర




దక్షిణాది రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన చిత్తూరు జిల్లా మదనపల్లె జంట హత్య ల కేసులో హైడ్రామాల మధ్య తల్లి తండ్రులు ఇద్దరి ని మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 24 న మంత్ర శక్తి పేరుతో చేసిన క్షుద్రపూజల్లో కన్నా బిడ్డలు ఆలేఖ్య(27), సాయి దివ్య (21)ల ను తల్లి తండ్రులేఅతి కిరాతకంగా హత్య చేసిన విషయం పోలీసుల విచారణ లో వారు ఒప్పుకున్నారు.ఈ కేసులో తండ్రి పురుషోత్తం నాయుడు ను తల్లి పద్మజ లను పోలీసులు

అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరుచగా 14 రోజులు రిమాండ్ విధించగా వారిని పోలీస్ భద్రత మధ్య సబ్ జైలు కు తరలించారు.

నిందితురాలి..అరుపులు..కేకలతో దద్దరిల్లిన పరిసరాలు..!

మదనపల్లె జంట హత్యల కేసులో నిందితుల అరెస్ట్ సందర్భంగా హైడ్రామా నెలకొంది. నిందితులకు అరెస్ట్ అనంతరం కోర్టు లో హాజరు పరిచే ముందు పోలీసులు కరోనా పరీక్షలకు తీసుకెళ్లారు. అయితే అసందర్భం గా నిందితురాలు పద్మజ కరోనా పరీక్షలకు నిరకరించ టంతో టెన్షన్ నెలకొంది. తాను కరోనా టెస్టులు ఎందుకు చేసుకోవాలని ఆమె అడ్డు తిరిగి అరుపులు కేకలు వేయటం తో కొంత సేపు ఉత్కతట నెలకొంది. చివరకు మహిళా పోలీసుల సహకారంతో కరోనా పరీక్షలు పూర్తి కాగ వారిని కోర్టులో హాజరు పరుచగా 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. దింతో నిందితులు భార్య భర్తలను సబ్ జైలు కు తరలించారు.

2,103 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon