- Neti Charithra
Breaking.. క్షణికావేశం..పచ్చని కాపురాన్ని..చిన్నాభిన్నం చేసింది..తల్లీ బిడ్డా..ఆత్మహత్య..!
Breaking.. క్షణికావేశం..పచ్చని కాపురాన్ని..చిన్నాభిన్నం చేసింది..తల్లీ బిడ్డా..ఆత్మహత్య..!
కడప: నేటి చరిత్ర
క్షణికావేశం.. ఫలితం.. తల్లి..బిడ్డ ఆత్మహత్య చేసుకున్న ఘటన కడప జిల్లాలో కల కలం రేపింది. స్థానిక పోలీసులు కథనం మేరకు..కడపకు చెందిన శ్రావణి(29)కి శివకుమార్ రెడ్డితో తొమ్మిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఎనిమిదేళ్ల కుమార్తె తన్విక ఉంది. శివకుమార్ రెడ్డి ప్రస్తుతం అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం
చేస్తున్నాడు.శ్రావణి... కుమార్తె తన్విక(8)తో కలిసి కడప పట్టణంశంకరాపురంలోనే నివాసం ఉంటోంది. అయితే, గత ఐదేళ్లుగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో గురువారం ఉదయం శ్రావణి తన కుమార్తెతో కలిసి పడక గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న చిన్నచౌక్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.