• Neti Charithra

Breaking... కోవిద్ వ్యాక్సిన్ వేయించుకున్న.. తాత్కాలిక ఉద్యోగి మృతి.. మదనపల్లె లో విషాదం..!


Breaking... కోవిద్ వ్యాక్సిన్ వేయించుకున్న.. తాత్కాలిక ఉద్యోగి మృతి.. మదనపల్లె లో విషాదం..!


మదనపల్లె: నేటి చరిత్ర



కోవిద్ టీకా వేయించుకున్న ప్రభుత్వ ఆసుపత్రి కింది స్థాయి కాంట్రాక్ట్ ఉద్యోగి

ఒకరు మృతి చెందిన ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లె లో కలకలం రేపింది. కుటుంబ సభ్యులు కథనం మేరకు.. మదనపల్లె

జిల్లా అస్పత్రిలో తాత్కాలిక ఎంఎన్‌ఒగా పనిచేస్తున్న నరసింహులు గత నెల 22 న రెండవ విడత కోవిద్ టీకా ను వేయించుకున్నాడు. అప్పటి నుండి అస్వస్థతకు గురై చలి.. జ్వరం అధికం కావడం తో నరసింహులును కుటుంబ సభ్యులు ఫిబ్రవరి 28 న బెంగుళూరు సంజాన్స్ ఆసుపత్రికి తరలించారు. లక్షకు పై డబ్బు ఖర్చు పెట్టినా..బెంగుళూరులో సోమవారం రాత్రి మృతి చెందారు. సమాచారం అందుకున్న మదనపల్లె ఎమ్మెల్యే నవాజ్ బాషా, బాస్ వ్యవస్థాపక అధ్యక్షులు పిటిఎం శివప్రసాద్, శ్రీ చందు, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతిని థి నరేంద్ర బాబు, సీపీఐ , సీపీఎం నాయకులు సాంబశివ, కృష్ణప్ప, శ్రీనివాసులు తదితర ప్రజా సంఘాల నేతలు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.






Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్