• Neti Charithra

Breaking..కరోనా విజృంభిస్తున్న వేళ.. కీలక నిర్ణయం తీసుకున్న జగన్ సర్కార్..!


Breaking..కరోనా విజృంభిస్తున్న వేళ.. కీలక నిర్ణయం తీసుకున్న జగన్ సర్కార్..!


అమరావతి: నేటి చరిత్ర



కరోనా మళ్ళీ విజృంభిస్తున్న వేళ.. ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది.

ఏప్రిల్‌ ఒకటి నుంచి ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్లు ఎపి విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేశ్‌ ప్రకటించారు. సోమవారం మంత్రి సురేశ్‌ మీడియాతో మాట్లాడుతూ.. పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి 10 వ తరగతి విద్యార్థులకు ఒక్కపూటే తరగతులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ప్రతీ ఉదయం 7 గంటల 45 నిముషాల నుంచి 12 గంటల 45 నిముషాల వరకు తరగతులు కొనసాగుతాయని, తరువాత మధ్యాహ్న భోజనం పెట్టాలని సూచించారు. ఎండలు, కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా.. పాఠశాల నుంచి విద్యార్థులను క్షేమంగా వారి ఇళ్లకు చేర్చటంపై ఉపాధ్యాయులు శ్రద్ద తీసుకోవాలని అన్నారు. పాఠశాలల్లో కోవిడ్‌ నిబంధనల అమలుపై అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులకు కోవిడ్‌ పరీక్షలను నిర్వహించాలని, మాస్క్‌లను ధరించడం, శానిటైజర్‌ను వినియోగించడం, భౌతికదూరాన్ని పాటించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సురేష్‌ ఆదేశించారు.