• Neti Charithra

Breaking.. కులాంతర వివాహ.. వివాదం.. మరో పరువు హత్య దారుణం..!


Breaking.. కులాంతర వివాహ.. వివాదం.. మరో పరువు హత్య దారుణం..!



ఆదోని: నేటి చరిత్ర


మరో పరువు హత్య కర్నూలు జిల్లాలో సంచలనం కలిగించింది. పోలీసుల కథనం మేరకు..కర్నూలు జిల్లాఆదోని పట్టణంలోని కిష్టప్పనగర్‌కు చెందిన ఆడం స్మిత్‌ నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఫిజియోథెరపిస్టుగా పనిచేస్తున్నారు. పట్టణానికి చెందిన యువతి, ఆడం స్మిత్ గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. వేర్వేరు


(పరువు హత్యతో మృతి చెందిన హతుడు)


సామాజికవర్గాలు కావడంతో వీరిద్దరి ప్రేమను పెద్దలు అంగీకరించలేదు. దీంతో రెండు నెలల క్రితం హైదరాబాద్‌లోని ఆర్యసమాజ్‌లో వాళ్లిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. వివాహం అనంతరం స్మిత్‌ దంపతులు ఆదోనికిష్టప్పనగర్‌లోనే నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలోగురువారం స్మిత్‌ తన విధులు ముగించుకొని ద్విచక్రవాహనంపై ఇంటికి తిరిగి వస్తుండగా పట్టణ శివారులోని ఆర్టీసీ కాలనీ వద్ద కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు స్మిత్‌పై దాడి చేశారు. ఇనుపరాడ్లు, బండరాయితో తలపై బలంగా మోది హతమార్చారు.

423 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon