- Neti Charithra
Breaking.. క్రిస్మస్ ప్రార్థనలు కు వెళుతున్న భక్తులపై దూసుకెళ్లిన లారీ...నలుగురు చిన్నారులు మృతి..
Breaking.. క్రిస్మస్ ప్రార్థనలు కు వెళుతున్న భక్తులపై దూసుకెళ్లిన లారీ...నలుగురు చిన్నారులు మృతి..!
కర్నూలు:నేటి చరిత్ర
కర్నూలు జిల్లాలో విషాదం చోటుచేసు కుంది. సరివెళ్ల మండలంలోని ఎర్రగుంట్ల గ్రామం వద్ద మంగళవారం
ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కర్నూలు-వైఎస్సార్ కడప జాతీయ రహదారిపై ఓ డీసీఎం లారీ తీవ్ర బీభత్సం సృష్టించింది. రోడ్డుపై నడుచుకుంటూ చర్చి ప్రార్థనలు
వెళుతున్న పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే నలుగురు చిన్నారులు మృతి చెందారు. 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందిచండం కోసం నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు
కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
153 views0 comments