• Neti Charithra

Breaking.. క్రిస్మస్ కు పుట్టింటికి పంపలేదని.. ఇద్దరు పిల్లలతో సహా తల్లి..ఆత్మహత్య..!


Breaking.. క్రిస్మస్ కు పుట్టింటికి పంపలేదని.. ఇద్దరు పిల్లలతో సహా తల్లి..ఆత్మహత్య..!



నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతిని థి)

ఓ ఇల్లాలి క్షణికావేశం.. ముగ్గురు ప్రాణాలను తీసిన ఘటన సికింద్రాబాద్‌లోని జవహర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.కుటుంబ కలహాలతో ఓ వివాహిత ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. శనివారం సాయంత్రం నాగమణి అనే వివాహిత తన ఐదేళ్ల కుమార్తె మార్వెల్ రూబీ, 8 నెలల కూతురితో కలిసి చెన్నపురం చెరువులో దూకింది. క్రిస్మస్‌ పండుగకు

పుట్టింటికి వెళ్తానని నాగమణి భర్తను అడిగింది. ఈ విషయంలో భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో నాగమణి తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలో ఆమె ఇద్దరు పిల్లలతో కలిసి ఇంటి నుంచి బయటికి వెళ్లిపోయింది.రాత్రి అయినా వాళ్లు ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు స్థానిక

పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తుండగా చెన్నపురం చెరువులో మూడు మృతదేహాలు ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులుఆదివారం ఉదయం అక్కడికి చేరుకొని మృత దేహాలను చెరువు లోనుంచి బయటికి తీయించారు. ఈ ప్రమాదం పై పోలీసులు విచారణ చేపట్టారు.

195 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon