• Neti Charithra

Breaking... కారు లో పట్టు పడ్డ కట్టల.. కట్టల డబ్బు..ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు..!


Breaking... కారు లో పట్టు పడ్డ కట్టల.. కట్టల డబ్బు..ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు..!


నెల్లూరు: నేటి చరిత్ర

కారు లో అక్రంగా తరలిస్తున్న కోటి రూపాయలు నగదు ను పోలీసులు నెల్లూరు లో సీజ్ చేయటం కలకలం రేపింది. వివరాలు ఇలా ఉన్నాయి. కోవూరు జాతీయ రహదారిపై రూ.కోటి నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సాయిబాబా ఆలయం వద్ద జాతీయ రహదారిపై మంగళవారంపోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా అటుగా వచ్చిన ఓ కారులో సోదాలు చేశారు. ఈ క్రమంలో కారులో రూ.కోటి నగదు కనిపించింది. సరైన పత్రాలు చూపించకపోవడంతో పోలీసులు ఆ నగదును సీజ్‌ చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కారు నెల్లూరు నుంచి గుంటూరు జిల్లా నరసరావుపేట వెళ్తున్నట్లు గుర్తించారు. ఈ మొత్తాన్ని

ఎన్నికల అవసరాలకు తరలిస్తున్నారా.. లేక ఇది బ్లాక్ మనీ నా అణా కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.