• Neti Charithra

Breaking..కురబలకోట లో ఇద్దరు ఆత్మహత్యాయత్నం.. ఒకరు మృతి మాజీ సైనికుని ఇంట్లో విషాదం..!


Breaking..కురబలకోట లో ఇద్దరు ఆత్మహత్యాయత్నం.. ఒకరు మృతి

మాజీ సైనికుని ఇంట్లో విషాదం..!



కురబలకోట: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా కురబలకోట మండలం లో తల్లి తో పాటు కుమార్తె ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా కుమార్తె మృతి చెందిన ఘటన విషాదాన్ని నింపింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఎర్రపల్లె కు చెందిన మాజీ సైనికుడు మారపరెడ్డి భార్య సరస్వతమ్మ కుమార్తె హేమలత లు ఇద్దరు మంగళవారం



(పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ తల్లి.. కూతురు)


పురుగుల మందు తాగిఆత్మహత్యాయత్నానికి పాల్పడగా కుమార్తె హేమలత మృతి చెందింది. సరస్వతమ్మ పరిస్థితి ఆందోళన కరంగా మారటం తో మదనపల్లె జిల్లా ఆసుపత్రి నుంచి తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. ముదివేడు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.