• Neti Charithra

Breaking.. కొత్త వ్యవసాయ చట్టాలు రద్దు కోరుతూ..కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించిన ప్రజా సంఘాలు!


Breaking.. కొత్త వ్యవసాయ చట్టాలు రద్దు కోరుతూ..కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించిన ప్రజా సంఘాలు!




విజయనగరం: నేటి చరిత్ర


కేంద్ర ప్రభుత్వం తీరును నిరసిస్తూ.. విజయనగరం జిల్లాలో ప్రజాసంఘాలు నిరసనలు చేసి కలెక్టరేట్ ను ముట్టడించ డం తో ఉద్రిక్తత నెలకొంది. వివరాలు ఇలా ఉన్నాయి. కార్మిక కోడ్‌లను, రైతు వ్యతిరేక మూడు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ విజయనగరం జిల్లా కలెక్టర్‌ కార్యాలయాన్ని కార్మికులు, స్కీమ్‌ వర్కర్లు సిఐటియు ఆధ్వర్యంలో గురువారం ముట్టడించారు. ఆనంతరం కలెక్టరేట్‌ ఎదురుగా రాస్తారోకో చేసేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు

పలువురు ప్రజా సంఘాల నాయకులు అరెస్ట్ చేశారు. కార్యక్రమంలోసిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు తమ్మినేని సూర్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి టివి.రమణ, నాయకులు రవికుమార్‌, జగన్‌, సుధారాణి, ఐద్వా జిల్లా కార్యదర్శి వి.లక్ష్మీ, సురేష్‌, బి.సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.