• Neti Charithra

Breaking.. కొత్త కరోనా తో.. కీలక ఆదేశాలు జారీ చేసిన ఏపీ సర్కార్..!


Breaking.. కొత్త కరోనా తో.. కీలక ఆదేశాలు జారీ చేసిన ఏపీ సర్కార్..!



నేటి చరిత్ర:( ప్రత్యేక ప్రతినిథి)


కొత్త కరోనా తో ఏపీ సర్కారు కీలక ఆదేశాలు జారీ చేసింది.

కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రంలోనూ జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ప్రకటన జారీ చేసింది. సార్స్ కొవ్ 2 కొత్త వేరియంట్ ప్రయాణికుల ద్వారా వ్యాప్తి చెందే అవకాశం ఉందని భావిస్తుండడంతో విమాన ప్రయాణికులు రాకపోకలపై దృష్టి పెట్టనుంది జగన్ సర్కార్. 

బ్రిటన్ సహా విదేశాల నుంచి కరోనా వైరస్ కొత్త వేరియంట్ వస్తుందంటూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన హెచ్చరికల మేరకు జగన్ సర్కార్ అలెర్ట్ అయింది. ప్రత్యేకించి విదేశీ ప్రయాణికులకు సంబంధించి జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలతో రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టింది. బ్రిటన్ సహా దక్షిణాఫ్రికా ,ఇటలీ తదితర దేశాల నుంచి వచ్చే విమాన ప్రయాణికులపై దృష్టి పెట్టాల్సిందిగా అధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల ద్వారా వైరస్ కొత్త వేరియంట్ వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున వారి ట్రావెల్ హిస్టరీపై ఆరా తీయాల్సిందిగా అధికారులను ఆదేశించింది ఏపీ సర్కార్.