- Neti Charithra
Breaking.. కొడుకు వేధింపులు.. భరించలేక.. కన్న తల్లే.. హత్య చేసింది..!
Breaking.. కొడుకు వేధింపులు.. భరించలేక.. కన్న తల్లే.. హత్య చేసింది..!
విశాఖ: నేటి చరిత్ర
కన్న కొడుకు వేధింపులు భరించలేక అతన్ని కన్న తల్లి హత్య చేసిన ఘటన విశాఖ జిల్లా
మధుర వాడ లో చోటు చేసుకుంది.ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
చెడువ్యసనాలకు బానిసైన కుమారుడిని ఓ తల్లి కడతేర్చింది.పీఎం పాలెం సీఐ రవికుమార్ కథనం మేరకు..
మధురవాడలోని మారికవలస న్యూకాలనీలో బ్లాక్ నెం144, ఎస్ఎఫ్3లో కోట్ల శ్రీను, మాధవి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి అనిల్(18)తో పాటు కుమార్తె ఉన్నారు. గత కొంతకాలం నుంచి అనిల్ చెడు వ్యసనాలకు బానిసై డబ్బులివ్వమని తల్లిదండ్రులను రోజూ వేధిస్తున్నాడు. ప్రతీరోజూ బయట
వ్యక్తులతో గొడవపడటంతోపాటు తల్లిదండ్రులపైనా భౌతికదాడులకు దిగుతున్నాడు. దీంతో విసిగిపోయి సోమవారం అర్థరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న అనిల్ ఛాతీపై తల్లి మాధవి గ్యాస్సిలిండర్తో కొట్టి హత్య చేసింది. పీఎంపాలెం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.