• Neti Charithra

Breaking.. కొడవళ్ళతో ఆరుగురి పై దాడి కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసిన పిటిఎం పోలీసులు..!


Breaking.. కొడవళ్ళతో ఆరుగురి పై దాడి కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసిన పిటిఎం పోలీసులు..!


పెద్దతిప్పసముద్రం: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా పెద్దతిప్పసముద్రం మండలం పులగంటి వారిపల్లె లో ఆరు మంది పై మూడు రోజుల క్రితం కొడవళ్ళతో జరిగిన దాడి కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు ములకలచేరువు సీఐ సురేష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా నిందితులనుంచి రెండు కొడవళ్ళను స్వాధీనం చేసుకొని అదే గ్రామానికి చెందిన హేమంత్ కుమార్,

ఈశ్వరప్ప, రమాదేవి లను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గ్రామాల్లో వివాదాలు తల ఎత్తితే తమ దృష్టికి తేవాలని లేదా ప్రతి సచివాలయం వద్ద విధులు నిర్వహిస్తున్న మహిళా పోలీస్ ద్వారా సమాచారం ఇస్తే బాధితులకు న్యాయం చెస్తామని అలా కాక గొడవలు, ఘర్షణ లకు దిగితే చట్టపర చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.