• Neti Charithra

Breaking.. కొండపల్లి బ్యాంక్ సెంటర్ లో భారీ అగ్నిప్రమాదం..రూ.50 లక్షల ఆస్తి నష్టం..!


Breaking.. కొండపల్లి బ్యాంక్ సెంటర్ లో

భారీ అగ్నిప్రమాదం..రూ.50 లక్షల ఆస్తి నష్టం..!



గుంటూరు: నేటి చరిత్ర


గుంటూరు జిల్లా కొండపల్లి బ్యాంకు సెంటర్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.

దుర్గా కేబుల్‌ నిర్వహించే భవనం విద్యుదాఘాతంతోదగ్ధమైంది. ప్రమాదం జరిగిన సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది.పోలీసుల కథనం మేరకు..తెల్లవారుజామున కేబుల్‌ గదిలో మంటలు వ్యాపించాయి. భవనంలో మంటలు మొదలై వెలుపలకు రావడంతో సమీపంలో ఉన్న విద్యుత్తు తీగలు దగ్ధమయ్యాయి. దీంతో ఆ ప్రాంతంలో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. ప్రమాద విషయం తెలుసుకొన్న కేబుల్‌ నిర్వాహకులు ఘటనా స్థలానికి చేరుకొని అగ్నిమాపక కేంద్రానికి సమాచారమిచ్చారు. మంటలను ఆర్పేందుకు నాలుగు అగ్నిమాపక వాహనాలు ప్రయత్నించాయి. ఎంతకీ మంటలు అదుపులోకి

రాకపోవడంతో విజయవాడ నుంచి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది సైతం మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించారు. కేబుల్‌ నెట్‌వర్క్‌కు సంబంధించి రూ.50లక్షల విలువైన ఎలక్ట్రికల్‌ యంత్రాలు ప్రమాదంలో కాలిపోయాయని నిర్వాహకులు వాపోయారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.