• Neti Charithra

Breaking...కోటి లంచం తీసుకొని తహసిల్దార్ న్యాయం ..చేయలేదంటూ.. నలుగురు ఆత్మహత్యాయత్నం..!


Breaking...కోటి లంచం తీసుకొని తహసిల్దార్ న్యాయం ..చేయలేదంటూ.. నలుగురు ఆత్మహత్యాయత్నం..!




అమరావతి: నేటి చరిత్ర


ఓ కుటుంబం కు సంబందించిన భూమిని ఆన్ లైన్ చేస్తామని కోటి రూపాయలు లంచం తీసుకొని ఇంతవరకు తహసిల్దార్ తమకు న్యాయం చేయలేదని ఏకంగా నలుగురు కుటుంబ సభ్యులు రాష్ట్ర రాజధాని వెలగ పూడి లోని సచివాలయం వద్దఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఏపీ రాజధానిలో కల కలం రేపింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.నెల్లూరు జిల్లా దుత్తలూరు

తహసీల్దారు చంద్రశేఖర్ తమను మోసం చేశారనిచిట్టమూరు మండలంకు చెందిన తాము చిలమూరులో ఉన్న తమ పొలం ఆన్‌లైన్‌ చేసేందుకు ఇప్పటి వరకూ రూ.కోటి ఇచ్చామని బాధితులు తెలిపారు. డబ్బులు ఇచ్చి ఏడాది గడుస్తున్నా తమ భూమిని ఆన్‌లైన్‌లో నమోదు చేయలేదని వాపోయారు. పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యకు యత్నించగా..అమరావతి సచివాలయం వద్ద ఉన్న పోలీసులు అడ్డుకుని దంపతులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన కలకలం రేపింది. ఈ విషయం పై విచారణ చేసి బాధితులకు న్యాయం చేయాలని నెల్లూరు కలెక్టర్ కు రెవిన్యూ శాఖ ఉన్నతాధికారులు ఆదేశించారు.