• Neti Charithra

Breaking.. కస్తూరిబా పాఠశాలలో ఏసీబీ తనిఖీలు.. పలు రికార్డులు సీజ్..!


Breaking.. కస్తూరిబా పాఠశాలలో ఏసీబీ తనిఖీలు.. పలు రికార్డులు సీజ్..!


అనంతపురం: నేటి చరిత్ర


అనంతపురం జిల్లా పరిగి కస్తూరిబా పాఠశాలలో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేసి పలు రికార్డులు సీజ్ చేశారు.

డీఎస్పీ కులశేఖర్‌ కథనం మీకు.. పరిగి కస్తూరిబా పాఠశాలపై వచ్చిన ఆరోపణలు, ఫిర్యాదులతో ఇక్కడికొచ్చామన్నారు. పాఠశాల నిర్వహణకు ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు, నిత్యావసరాలు, అకౌంట్స్‌ రికార్డులను పరిశీలించామన్నారు. విద్యాబోధన, మెనూ, తాగునీరు, ఇతర సదుపాయాలపై విద్యార్థినులతో మాట్లాడినట్లు పేర్కొన్నారు. చదువుతో

పాటు స్పోకెన్‌ ఇంగ్లిష్‌, వృత్తి విద్యాకోర్సులు, భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు, క్రీడల్లో శిక్షణ ఇస్తున్నారా లేదోనని తెలుసుకున్నామ న్నారు. నివేదికను ఉన్నతాధికారులకు అందిస్తామన్నారు. తనిఖీ రాత్రి వరకు కొనసాగింది. ఆయన వెంట ఏసీబీ ఇన్‌స్పెక్టర్లు ప్రభాకర్‌, చక్రవర్తి, ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లు, ప్రధానోపాధ్యాయులు, సిబ్బంది ఉన్నారు.

Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్