• Neti Charithra

Breaking.. కళాశాల ఫీజు కట్టలేక.. అవమాన భారంతో ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య..!


Breaking.. కళాశాల ఫీజు కట్టలేక.. అవమాన భారంతో ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య..!



నేటి చరిత్ర:( ప్రత్యేక ప్రతినిథి)


కళాశాల లోఫీజు చెల్లించలేక ఓ విద్యార్థిని

ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఒంగోలు జిల్లా లో

కల కలం రేపింది. పోలీసులు కథనం మేరకు..ఒంగోలులోని గొడుగుపాలెంలో పాపిశెట్టి తేజస్విని (19) ఇంట్లోనే ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. నగరంలోని క్విస్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఈసీఈ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఆమె తండ్రి నాగేశ్వరరావు ముఠా కూలీ. ఫీజు రియంబర్స్‌మెంట్‌

సౌకర్యం ఆగిపోవడంతో ఫీజులు కట్టలేక సతమతమవుతున్నారు.శుక్రవారం రూ.35వేలు ఫీజు చెల్లించిన తండ్రి ఇకపై తాను చెల్లించలేనని చెప్పడంతో మనస్తాపానికి గురైన తేజస్విని ఇంట్లోనే ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటనపై ఒంగోలు ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.