• Neti Charithra

Breaking.. కళాశాలలో ఏకంగా 163 మంది విద్యార్థులు కు కరోనా పాజిటివ్.. ఉలిక్కిపడ్డ ఏపీ ప్రభుత్వం..!


Breaking.. కళాశాలలో ఏకంగా 163 మంది విద్యార్థులు కు కరోనా పాజిటివ్.. ఉలిక్కిపడ్డ ఏపీ ప్రభుత్వం..!



రాజమండ్రి: నేటి చరిత్ర


ఓ ప్రవేటు కళాశాలలో కరోనా కలకలం రేపింది. ఏకంగా 163 మందికి పాజిటివ్ తేలడంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. వివరాలు ఇలా ఉన్నాయి.

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్‌ పరిధిలోని ఆ కళాశాలలో మొత్తం 163 మంది విద్యార్థులకు కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయింది. గత రెండు రోజుల నుంచి వరుసగా 13, 10 చొప్పున కేసులు నమోదు అవుతుండగా.. సోమవారం ఒక్కరోజే 140 మందికి నిర్ధారణ అయిందని డీఎంహెచ్‌వో డా.గౌరీశ్వరరావు తెలిపారు. ఇప్పటి వరకు సుమారు 700మంది విద్యార్థుల నమూనాలు సేకరించి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. పాజిటివ్‌ నిర్ధారణ అయిన వారిని ఒక చోట ఉంచి ఆ ప్రాంతాన్ని కంటైన్‌మెంట్‌ జోన్‌గా చేశామన్నారు. దింతో ఏపీ ప్రభుత్వం విద్యా సంస్థలు.. విద్యాలయాలు లో కోవిద్ ఆంక్షలు అమలుకు చేయని వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.