• Neti Charithra

Breaking.. కలకలం..రేపిన మహిళా కానిస్టేబుల్.. ఆత్మహత్యాయత్నం..!


Breaking.. కలకలం..రేపిన

మహిళా కానిస్టేబుల్.. ఆత్మహత్యాయత్నం..!



అనంతపురం: నేటి చరిత్ర


ఓ మహిళా కానిస్టేబుల్ దోమల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం అనంతపురం లో కలకలం రేపింది. వివరాలు ఇలా ఉన్నాయి.నగరంలో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్ గత కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వారి మధ్య ఏర్పడిన మనస్పర్థల కారణంగా శ్యామల దోమలను చంపడానికి

ఉపయోగించే ఆల్ అవుట్ ద్రావణాన్ని తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబసభ్యులు హుటాహుటిన శ్యామలను ఆస్పత్రికి తరలించారు. శ్యామలకు డాక్టర్లు చికిత్సను అందిస్తున్నారు. శ్యామల భర్త మరొకరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ తనను వేధింపులకు గురిచేస్తున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం పోలీస్ శాఖలో కలకలం రేపింది

Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్