- Neti Charithra
Breaking.. కర్నూలు జిల్లా లో పడగ విప్పిన ఫ్యాక్షన్.. సీపీఐ నేత పై వైసీపీ నేత హత్యాయత్నం.. !
Breaking.. కర్నూలు జిల్లా లో పడగ విప్పిన ఫ్యాక్షన్.. సీపీఐ నేత పై వైసీపీ నేత హత్యాయత్నం.. !
కర్నూలు: నేటి చరిత్ర
కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ కక్షలు మరోసారి
పడగ విప్పాయి.పత్తికొండ – చినహుల్తీ దగ్గర సీపీఐ నేత రాంభూపాల్ రెడ్డిపై బుధవారం
హత్యాయత్నం జరిగింది. ప్రత్యర్థి వైసీపీ నేత అమర్ నాధ్ రెడ్డి ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. రాంభూపాల్ రెడ్డిని జీపుతో ఢీకొట్టి తుపాకీతో కాల్చేందుకు ప్రయత్నించారు. ఇనుపరాడ్లతో కొట్టేందుకు దుండగులు ప్రయత్నించారు. అయితే స్థానికులు అడ్డుకోవడంతో వైసీపీ నేత అమర్ నాధ్ రెడ్డి పరారయ్యారు. రాంభూపాల్ రెడ్డిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి వద్దకు సీపీఐ కార్యకర్తలు భారీగా చేరుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది.
218 views0 comments