• Neti Charithra

Breaking..కరోనా మృతుని వద్ద బంగారుఆభరణాలు లాక్కెళ్ళిన ఆసుపత్రి సిబ్బంది..చిత్తూరుజిల్లాలో మరో దారుణం


Breaking.. కరోనా మృతుని వద్ద బంగారు ఆభరణాలు లాక్కెళ్ళిన ఆసుపత్రి సిబ్బంది...చిత్తూరు జిల్లా లో మరో దారుణం!



తిరుపతి: నేటి చరిత్ర


(కరోనా మృతుని వద్ద ఆభరణాలు ను లకెళుతున్న ఆసుపత్రి సిబ్బంది)



స్విమ్స్‌ కొవిడ్‌ ఆస్పత్రి జీఎస్‌-2లో

దారుణ ఘటన చోటు చేసుకుంది.

మృతిచెందిన బాధితుడి ఎడమచేతికి ఉన్న రెండు ఉంగరాలు లాక్కున్నారు. చివరి చూపు కోసం మార్చురీ వద్దకు వచ్చిన కుటుంబసభ్యులు బంగారు ఉంగరాలు

కన్పించకపోవడంతో ఆస్పత్రి భద్రతాధికారికి ఫిర్యాదు చేశారు. చిత్తూరు జిల్లా

చౌడేపల్లికి చెందిన వెంకటరత్నం నాయుడుకి కరోనా సోకింది. ఈ నెల 14వ తేదీ రాత్రి స్విమ్స్‌ కొవిడ్‌ ఆస్పత్రికి వచ్చారు. గుండెపోటుతో 23వ తేదీ మృతిచెందాడు. మృతదేహాన్ని ప్రత్యేక సంచిలో అమర్చడానికి వచ్చిన వార్డుబాయ్‌

మృతుడి ఎడమ చేతికి ఉన్న రెండు ఉంగరాలు లాగేశాడు. ఈ విషయమై మృతుడి మేనకోడలు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ ఘటన ఆసుపత్రి సీసీ కెమెరాల లో రికార్డు కావడంతో విమర్శలు వెలువెత్తుతున్నాయి.


358 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon