• Neti Charithra

Breaking.. కరోనా తో మరో బ్యాంక్ లో డిప్యూటీ మేనేజర్ మృతి...చిత్తూరు జిల్లా లో విషాదం..!


Breaking.. కరోనా తో మరో బ్యాంక్ లో

డిప్యూటీ మేనేజర్ మృతి...చిత్తూరు జిల్లా లో విషాదం..!


నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతిని థి)


చిత్తూరు జిల్లా చంద్రగిరి ఆంధ్ర బ్యాంకు డిప్యూటీ మేనేజర్ కరోనా తో మృతి చెందారు.చంద్రగిరి ఆంధ్ర బ్యాంకు మేనేజర్ పి మోహన్ ఇచ్చిన సమాచారం మేరకు ఆంధ్రబ్యాంకు లో డిప్యూటీ మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్న 57 సం ల ఉద్యోగి

గత రెండు సంవత్సరాలుగా చంద్రగిరి ఆంధ్ర బ్యాంకు లో విధులు నిర్వహిస్తున్నారు.

వీరికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె కలరు.

ఆయన గత నెల 17వ తేదీన కరోనా పాజిటివ్ రావడంతో రమాదేవి హాస్పిటల్ లో వైద్యం చేయించుకున్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉండడంతో చెన్నై చెట్టినాడ్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ సెంటర్ లో వైద్యం చేయించుకుంటున్నారు. ఈనెల 26వ తేదీ శనివారం మృతి చెందారు. కుటుంబంలో భార్య ముగ్గురు పిల్లలకు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. కుమార్తె కు వివాహం అయ్యింది. ప్రసవం కొరకు పుట్టింటికి వచ్చింది. తండ్రి హాస్పిటల్లో ఉన్న సమయంలోనే ప్రసవం అయి కుమారుడు పుట్టినట్లు తెలుస్తుంది.

చంద్రగిరి ఆంధ్ర బ్యాంకు మేనేజర్ పి మోహన్ తన సహ ఉద్యోగి కరోనాతో మరణించడం చాలా బాధాకరంగా ఉందని సిబ్బంది అందరూ కరోనా వైద్య పరీక్షలు చేయించుకోవడం జరిగిందని అందరికీ నెగిటివ్ వచ్చిందని సహ ఉద్యోగి కరోనాతో మృతి చెందడం ఆయన ఆత్మకు శాంతి కలగాలని కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.