• Neti Charithra

Breaking.. కరోనా తో మరో ఎమ్మెల్యే మృతి.. పార్టీ శ్రేణుల్లో విషాదం..!



Breaking.. కరోనా తో మరో ఎమ్మెల్యే మృతి.. పార్టీ శ్రేణుల్లో విషాదం..!



నేటి చరిత్ర:( ప్రత్యేక ప్రతిని థి)


కర్ణాటక లోకాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్యే బి నారాయన్‌ రావ్‌ కరోనాతో గురువారం

రాత్రితుది శ్వాస విడిచారు. బీదర్‌ జిల్లా బసవకల్యాణ్‌ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయిన నారాయణ రావ్‌ సెప్టెంబర్‌ 1న కరోనా కారణంగా తలెత్తిన 

అనారోగ్యంతో బెంగళూరులోని ఆస్పత్రిలో చేరారు. అవయవాలు పాడైపోవడం కారణంగా పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఈయన మృతి పట్ల కేంద్ర రసాయన, ఎరువుల శాఖ మంత్రి సదానందగౌడ

సంతాపం వ్యక్తం చేశారు. బుధవారం రాత్రి ఇదే రాష్ట్రానికి చెందిన లోక్‌సభ ఎంపీ, కేంద్రమంత్రి సురేశ్‌ అంగడి కరోనాతో కన్నుమూసిన విషయం తెలిసిందే. దీనికి కొద్ది రోజుల ముందు కర్ణాటక రాష్ట్రానికే చెందిన రాజ్యసభ ఎంపీ అశోక్‌గస్తీ కూడా మరణించడం గమనార్హం.


778 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon