• Neti Charithra

Breaking..కరోనా కేసులు మళ్ళీ..పెరుగుతున్నాయిఅప్రమత్తంగా ఉండండి-జిల్లా పర్యవేక్షణ అధికారి లోక వర్ధన్


Breaking..కరోనా కేసులు మళ్ళీ.. పెరుగుతున్నాయి..అప్రమత్తంగా ఉండండి- జిల్లా పర్యవేక్షణ అధికారి లోక్ వర్ధన్!



తిరుపతి: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా లో104సంచార వైద్య సేవలను బలోపేతం చెద్దామని జిల్లా నోడల్ అధికారి( 104 మరియు 108) డాక్టర్ లోకవర్ధన్ అన్నారు. శనివారం మధ్యాహ్నం జిల్లా నోడల్ అధికారి నోడల్ అధికారి డాక్టర్ లోకవర్ధన్ జిల్లా లోని 104వాహన వైద్య సేవలలో పనిచేస్తున్న 64 మంది


డాక్టర్స్,మరియు ఓ.ఈ లు,జిల్లా manager లతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా నోడల్ అధికారి మాట్లాడుతూ ప్రతి 104 లొకేషన్ లో కరోనా ప్రోటోకాల్ స్క్రీనింగ్ జరగాలని, అవసరమైన సమయంలో స్వాబ్ కలెక్షన్ అక్కడికక్కడే చేయాలని ఆదేశించారు. కరోనా వ్యాక్సినేషన్ పై కూడా అవగాహన కల్పించాలని కోరారు. ఓ.పి.సేవలు పూర్తి ఐన తర్వాత భోజన విరామం అనంతరం

గృహ దర్శనాలు చేయాలని అన్నారు. గృహ దర్శనాలలో నీరు నిల్వ ప్రదేశాలు గుర్తించి విషజ్వరాలు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. క్షయ,కుష్టు వంటి రోగులు షెడ్యూల్ ప్రకారం మందులు తింటున్నారా? పడక పైన గలా రోగులకు ఏమైనా ఆరోగ్య సేవలు అందించేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రతి రోజు వారీ 104 సేవల రోజు వారీ ప్రగతి నివేదిక సాయంత్రం 4.00 గం నోడల్ అధికారి మరియూ జిల్లా కోఆర్డినేటర్, సంభధిత పి.హెచ్.సి.వైద్యాధికారి వారికి మెయిల్ లేదా వాట్స్ప్ ద్వారా పంపాలని ఆదేశించారు. మందుల కొరత లేకుండా చూసుకోవాలి అని ఆదేశించారు. ఈ జూమ్ సమావేశంలో జిల్లా కోఆర్డినేటర్ భాస్కర్,64 వాహనాల వైద్యులు, అదనపు జిల్లా మేనేజర్ శ్రీవారి, హెల్త్ ఎడ్యుకేటర్ మహమ్మద్ రఫీ,ఓ.ఈ లు తదితరులు పాల్గొన్నారు