• Neti Charithra

Breaking.. కరోనా ఆసుపత్రి లో "కసాయి" తత్వం.. పది లక్షలు తీసుకొని మరో మృతదేహం అప్పగింత..!



Breaking.. కరోనా ఆసుపత్రి లో "కసాయి" తత్వం.. పది లక్షలు తీసుకొని మరో మృతదేహం అప్పగింత..!



నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతిని థి)


కరోనా బాధితులపట్ల తెలుగు రాష్ట్రాల్లో

పలు ప్రయివేటు ఆసుపత్రులు దారుణంగా వ్యవహరిస్తున్నాయి. ఈ ఆసుపత్రుల పట్ల ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాలని బాధితులు కోరుతున్నారు. తాజాగా

హైదరాబాద్‌లోని ఓ ప్రయివేట్‌ ఆస్పత్రి నిర్లక్ష్యంతో మృతదేహాలు

తారుమారయ్యాయి. నిజామాబాద్‌ జిల్లా ఇందల్వాయి మండలం గన్నారం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కరోనాతో చికిత్స పొంతూ హైదరాబాద్‌ మృతిచెందారు. బిల్లు కడితే మృతదేహం అప్పగిస్తామని ఆస్పత్రి యాజమాన్యం తేల్చి చెప్పడంతో మృతుడి బంధువులు రూ.10 లక్షలు చెల్లించారు. అంత్యక్రియల కోసం ఒక మృతదేహానికి బదులు మరో మృతదేహాన్ని అప్పగించారు. మృతదేహాన్ని చూపించండని బంధువులు ప్రాధేయపడినా నిబంధనలు ఒప్పుకోవని చితికి నిప్పుపెట్టే ప్రయత్నం చేశారు. చివరి క్షణంలో అంబులెన్స్‌ డ్రైవర్‌ ఫోన్‌ చేసి మృతదేహం వారిది కాదని చెప్పడంతో బంధువులు అవాక్కయ్యారు. దీంతో

ఆస్పత్రి నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆస్పత్రి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అంబులెన్స్‌ డ్రైవర్‌ ఫోన్‌ చేసి చెప్పకపోతే ఆ రెండు సెకెన్లలోనే చితికి నిప్పు పెట్టేవాళ్లమని, రూ.10 లక్షలు బిల్లు కట్టినా నిర్లక్ష్యంతో వేరే మృతదేహం అప్పగించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.